కోలమూరు పంచాయతీలో రూ, 2 కోట్ల తో సిసి రోడ్లు, డ్రైన్లు

 రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని


కొలమూరు పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల తో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపడుతున్నారు. కోలమూరు, కొంతమూరు, రాయుడుపాక లు గ్రామల్లోని ఆదర్శనగర్, బొమ్మన కాలనీ, శ్రీ నగర్, రాయుడు పాకలు లలో 45 లక్షల రూపాయలతో సిసి డ్రైన్లు,  కోటి 60 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి డి. శ్రీనివాస్ రావు తెలిపారు. బదిలలో భాగంగా పత్తిపాడు గ్రామపంచాయతీ నుండి పాలమూరు పంచాయతీకి బదిలీపై వచ్చారు. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పనులకు ఈ పనులకు శంకుస్థాపన చేశారని కార్యదర్శి తెలిపారు.