దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100కోట్లకు పైగా మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గత 10 రోజుల వ్యవధిలో 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఆ తర్వాతి 3 స్థానాల్లో కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.