రూ.1,000 కోట్ల పెట్టుబడులు.12,500 మందికి ఉపాధి


కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.