100 KM వేగంతో ఢీకొట్టిన రైలు


తమిళనాడు లో రైలు ప్రమాదం జరిగిన కవరైపెట్టై స్టేషన్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 100 KM వేగంతో ఢీకొట్టింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో లోకో పైలట్ రైలును ముందుకు తీసుకెళ్లారని, అదే వేగంతో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ ట్రైన్ రెండు ఏసీ బోగీలు సహా 6 బోగీలు పట్టాలు తప్పాయి. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.