పిడుగులు పడతాయి జాగ్రత్త


TV77 తెలుగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.ప్రజల ఫోన్లకు సంక్షిప్త సందేశాలను పంపించింది. గతంలో అనేకసార్లు పిడుగుపాటు హెచ్చరికలు నిజమయ్యాయి. గత నెలలో సామర్లకోట, కోనసీమ ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రైతులు ప్రజలు గొర్రెల కాపరులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.