ప్రేమ పేరుతో యువతి ని నమ్మించి మోసం చేసిన యువకుడి పై కేసు నమోదు


 TV77 తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీనివాస్ నగర్ కు చెందిన డ్రైవర్ అళ్ళ శ్రీ రవి అనే యువకుడు లలిత నగర్ కు చెందిన ఒక యువతి ని ప్రేమిస్తున్నానని ,పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరికంగా అనుభవించి తరువాత పెళ్లికి నిరాకరించడం తో యువతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి వన్ టౌన్ సి ఐ ఎస్ లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లలిత నగర్ కు చెందిన ఒక యువతి బ్యూటీ పార్లర్ లో పనిచేస్తుండగా ఈమెకు అళ్ళ శ్రీ రవి తో పరిచయం ఏర్పడింది. పరిచయం పేరుతో గత రెండేళ్లుగా యువతి ని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శారీరకంగా కలవమని బలవంతం చేస్తున్నాడు. అయితే యువతి ని నమ్మించడానికి స్థానిక అన్నపూర్ణమ్మ పేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో పూలదండలు వేసుకుని మనకు పెళ్లయిపోయిందని ఇకనుంచి మనిద్దరం భార్యాభర్తలమని నమ్మించి బలవంతంగా శారీరకంగా అనుభవించాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సిఐ  తెలిపారు. ఇరువురిని పిలిచి కౌన్సిలింగ్ చేసామని పెళ్లికి యువకుడు నిరాకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని సిఐ లక్ష్మణరావు తెలిపారు..