లారీ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభించిన రుడా చైర్పర్సన్ మేడపటి షర్మిళ రెడ్డి


 

రాజమండ్రి:29-6-2023 గురువారం

రాజమండ్రి లారీ స్టాండ్ లో ది రాజమండ్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు రుడా చైర్పర్సన్ మేడపటి షర్మిళ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని లారీ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా షర్మిళ రెడ్డి మాట్లాడుతూ ది రాజమండ్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ వారందరూ కలిసి లారీ సర్వీసింగ్ పెట్టుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ డ్రైవర్లు లారీ లోడు వేసుకొని అనేకమైన రాష్ట్రాలు, ప్రాంతాలు తిరిగి వెళ్లే దారి మధ్యలో చెరువుల దగ్గర లారీని చాలా కష్టపడుతూ శుభ్రం చేసుకుంటారు ఇప్పుడు వేలు ఎక్కడ తిరిగినా సరే ఈ లారీ స్టాండ్ దగ్గరకు వచ్చి సర్వీసింగ్ చేసుకునే విధంగా ఈ లారీ స్టాండ్ లో సర్వీసింగ్ సెంటర్ పెట్టడం చాలా మంచి తరుణం అని చెప్పారు ఈ కార్యక్రమంలో ది రాజమండ్రి లారీ ఓనర్స్ గౌరవ అధ్యక్షురాలు రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి,ప్రెసిడెంట్ శ్రీనివాసరావు,వైస్ ప్రెసిడెంట్ డి.వెంకటేశ్వరరావు, సెక్రటరీ మోల్లి వెంకటరమణ, ఆర్గనైజర్ హక్కుమహంతి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ రాంబాబు లారీ ఓనర్ మినీ వ్యాన్ సభ్యులందరూ పాల్గొన్నారు.