ఇరిగేషన్ స్థలాన్ని యదేచ్చగా కబ్జా చేసిన గిరిజనే తురుడు


 గిరిజన ప్రాంతంలో  గిరిజనే తురుడు ఇరిగేషన్ స్థలం  కబ్జా

దుకాణాలతో సహా పక్క భవన నిర్మాణం

పట్టించుకోని మండల పంచాయతీ, అధికారులు


రాజమహేంద్రవరం క్రైమ్ బ్యూరో :

గిరిజన ప్రాంతమైన దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామపంచాయతీ పరిధిలో ఇరిగేషన్ స్థలాన్ని యదేచ్చగా కబ్జా చేసిన   గిరిజనే తురుడు ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇందుకూరుపేట ఇందుకూరు గ్రామపంచాయతీ కార్యదర్శులు స్థానిక ప్రజలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందుకూరు ఇందుకూరుపేట గ్రామాల మీదగా ముసురు మిల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి చాగు కాలవ ప్రవహిస్తుంది. 


ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో   గిరిజనే తురుడు అయినా కామిశెట్టి వీరబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ స్థలాన్ని యదేచ్ఛగా కబ్జా చేసి ఆ స్థలంలో ఐదు షాపింగ్ దుకాణాలు తో సహా పక్కా నివాస భవనాన్ని నిర్మించాడు. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఇందుకూరు, ఇందుకూరి పేట గ్రామపంచాయతీల నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తుంది. అంతేకాక ఐటీడీఏ అధికారుల నుంచి సైతం ఎలాంటి  అనుమతులు లేవని తెలుస్తుంది. 



మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ఎదుటనే ఈ అక్రమ భవన నిర్మాణం ఉన్న పట్లకి రెవెన్యూ అధికారులుసైతం గిరిజన ప్రాంతంలో ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి పక్క భవన నిర్మాణం చేపట్టినప్పటికీ ఆక్రమణ లను గుర్తించకపోవడం అధికారుల ఉదాసేన తను స్థానిక ప్రజలు, గిరిజనులు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆక్రమణపై ప్రభుత్వం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అక్రమ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు...

మరిన్ని అప్డేట్స్ తో coming soon