వివాదం చిన్నదే పోలీసులు తీరు అమానుషం


 అమాయకున్ని చితకబాదిన ఇన్చార్జ్ ఎస్సై శారద సతీష్ . పోలీసులు అరాచకం

వివాదం చిన్నదే పోలీసులు తీరు అమానుషం

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

ఎస్సై పోలీసులపై చర్య తీసుకోవాలని ఎస్ పి కి విజ్ఞప్తి చేసిన బీసీ సంఘాలు

సీతానగరం tv77తెలుగు

శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే చిన్నపాటి వివాదాలను భూతద్దంలో చూస్తూ అనాలోచితంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలంలో లంకూరు లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కేసు నమోదు అయింది. .లంకూరులో పాత రామాలయం (వడ్డీల రామాలయం) వద్ద సాయంత్రం వేళలో గ్రామస్తులు కూర్చోవడం పరిపాటి  అయితే స్థానిక యువకులు సెల్ ఫోన్లు l మాట్లాడడం స్థానిక పెద్దలకు ఇష్టం లేదు.  దాంతో రెండు సామాజిక వర్గాల మధ్య  వివాదం చెలరేగింది. ఒక దశలో వివాదం సద్దుమణిగింది. గుడికి సంబంధించి కొమ్మిరెడ్డి రాము అనే పెద్దమనిషి కోరుకొండ,  సీతానగరం పోలీసులను పెద్ద ఎత్తున రప్పించి వివాదాన్ని మళ్లీ రేపాడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వివాదాన్ని సద్ది చెప్పి ఇరువర్గాలను పంపించి వేశారు. అయితే వివాదంతో సంబంధంలేని అదే ఊరికి చెందిన ముళ్ళ సూరిబాబు అనే యువకుడు గోదావరి గట్టు బహిర్భూమికి వెళ్లి బండి పార్కు చేసిన రామాలయం వద్దకు వస్తున్నాడు.  ఈ క్రమంలో సీతానగరం ఇంచార్జ్ ఎస్సై శారదా సతీష్ ,మరో ముగ్గురు పోలీసులు సూరిబాబు ని ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ నీకు పని ఏమిటి అని ప్రశ్నిస్తూనే రామాలయం వెనక్కి తీసుకెళ్లి చీకటిలో నలుగురు కలిసి లాటిలతో పిర్రలు, కాళ్లపైన చితకబాధారు అని బాధితుడు వాపోయాడు. సార్ నాకు రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగిందని ,వివాదంతో సంబంధం లేదని కాళ్ళ వేళ్ళ పడి మొర పెట్టుకున్న ఎస్సై కాళ్లతో తన్ని లాటితో బాధరని సూరిబాబు మీడియాతో వాపోయాడు. వివాదంలో ఉన్నవారు అందరూ తప్పించుకున్నారని సంబంధంలేని నన్ను ఇలా చితకబాధడం అన్యాయమని అన్నాడు. ఈ సంఘటన ను జిల్లా ఎస్పీ దృష్టికి తమ సామాజిక వర్గం, బీసీ నాయకులు తీసుకువెళ్తారని పేర్కొన్నాడు ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ, వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిన పోలీసులు  మా వర్గం పైనే దురుసుగా ప్రవర్తించారని, అవతల  వర్గాన్ని కొమ్ముకాశారని ఆరోపించారు. బాధితుడికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామని, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.