TV77 తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:
రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు సెంట్రల్ జోన్ డిఎస్పి విజయ్ పాల్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్థానిక గుండు వారి వీధిలో ఒక ఇంటిలో పేకాడుతున్న బృందంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో.. దలై శ్రీనివాస్, కర్ణ శంకర్రావు, చుక్క సురేంద్ర బాబు, బస అప్పల్ రెడ్డి, కొయ్య రాజశేఖర్, సోము సుందర రామిరెడ్డిలను అరెస్ట్ చేసామని సిఐ తెలిపారు. వీరు నుంచి 51,020 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఈ దాడిలో ఏ ఎస్ ఐ రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుల్ మళ్లీ బాబు తదితరులు పాల్గొన్నారు..