తుఫాన్ రైతులకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ రాక.


 TV77 తెలుగు కొత్తపేట:

  కొత్తపేట నియోజకవర్గ అవిడిలో  రైతులను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్.నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు. గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన వారి రైతులను పరామర్శించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10న కొత్తపేట నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. కొత్తపేట మండలం అవిడి గ్రామంలోని రైతులను పవన్ కళ్యాణ్ నేరుగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం ఉదయం మధురపూడి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగుతారని తదుపరి అక్కడి నుంచి నేరుగా కొత్తపేట నియోజకవర్గానికి రోడ్డు మార్గంలో రానున్నట్లు బండారు శ్రీనివాస్ తెలిపారు. ఆలమూరు మండలం మడికి నుంచి జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి గ్రామం చేరుకుంటారని వివరించారు.  ఈ సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ర్యాలీ మడికి గ్రామం నుంచి జరుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ స్వాగత ర్యాలీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బండారు శ్రీనివాస్ కోరారు.