రైలు దహనం కేసు కొట్టివేత

 


TV77 తెలుగు తుని:

తుని రైలు దహనం కేసులను రైల్వే కోర్టు కొట్టి వేసింది. మొత్తం 41 మంది నిందితుల విషయంలో సరైన సాక్ష్యాలను చూపించడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారు. సరిగ్గా విచారణ చేయని ముగ్గురు రైల్వే పోలీసులపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు.  ఈ ఘటన విషయంలో  ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదని రైల్వే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.సున్నితమైన అంశాన్ని ఐదేళ్ళపాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించారు.  ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని.. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని వ్యాఖ్యానించింది.  ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని కోర్టు స్పష్టం చేసి కేసులను కొట్టి వేసింది.