TV77 తెలుగు కాకినాడ :
కాకినాడ జి.జి.హెచ్ వైద్య ఆరోగ్యశాఖ శానిటరీ విభాగానికి చెందిన చెందిన జూనియర్ అసిస్టెంట్ యేంటి సత్యనారాయణతో పాటూ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు జరిగాయి. సత్యనారాయణకు కళ్లు చెదిరేలా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ విలువ ప్రకారం సుమారు రూ. 3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు.