TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :
బొమ్మూరు సి ఐ అర్ విజయ్ కుమార్ వెల్లడి
రాజమండ్రి రూరల్ గత నెల స్థానిక సావిత్రి నగర్ లో ఒక ఇంటిలో దొంగతనం చేసి పారిపోయిన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారినుంచి 15 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని బొమ్మూరు సి ఐ ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో కేసుల వివరాలు తెలిపారు. 18-04-2023 వ తేదిన అర్ధరాత్రి సమయములో రాజమహేంద్రవరం రూరల్ మండలం, హుక్కంపేట గ్రామ పంచాయతీ పరిది సావిత్రినగర్ లో మాదిరెడ్డి రామా నాయుడు అలియాస్ నాయుడు, కోరుబిల్లి నాగరాజు, అలియాస్ ఆర్య ఇద్దరు కలసి ఇనుప రాడ్డుతో ఇంటి తలుపుకి ఉన్న తాళం పగులకొట్టి లోపలకి వెళ్ళరు., ఆ ఇంటి బెడ్ రూములో ఉన్న బీరువా సేఫ్ లాకరుని పగుల కొట్టి బంగారపు చెవి దుద్దులు 6 జతలు, బంగారపు నక్లెసులు 3, బంగారపు చైన్లు 3,బంగారపు నల్లపూసల గొలుసు, బంగారపు ఉంగరాలు 10, బంగారపు లక్ష్మీదేవి కాసులు, బంగారపు ముక్కుపుడక, బంగారపు చిన్న గొలుసు, మరియు
సుమారు 2 కేజీల బరువు గల వెండి పల్లెములు 3 వెండి అష్టలక్ష్మి చెంబు, వెండి లక్ష్మీదేవి విగ్రహము, వెండి కుందులు 5, వెండి గిన్నెలు 3, వెండి గ్లాస్ ఒకటి వెండి పట్టెలు 3 జతలు, వెండి గంధపు గిన్నె వెండి కుంకుమ బరినే 2, మరియు 75,000/- రూపాయలను దొంగతనము చేసుకొని పారిపోయరన్నారు.వారిని . 28-04-2023 వ తేదిన డి -మార్ట్ గేటు వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రు.15,00,000/- విలువైన 200 గ్రాముల బంగారపు వస్తువులను, మరియు రెండు కేజీ ల వెండి వస్తువులను మరియు రు.43,000/- లను రికవరీ చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, రిమాండ్ పంపుచున్నామన్నారు.. ఈ కేసులో పై ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేసి, చోరీ సొత్తను రికవరీ చేసిన బొమ్మూరు పోలీసు స్టేషన్ సీఐ విజయకుమార్ ను , వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
.