పిడుగులు పడే అవకాశం


 TV77 తెలుగు అమరావతి:

తూ.గో, ప.గో జిల్లాల వ్యాప్తంగా కాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పొలంలో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు-గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.చెట్లకింద ఉండొద్దని హెచ్చరించింది. ఇవాళ ఉభయ గోదావరి,కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.