TV77 తెలుగు రాజమండ్రి :
ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను రాజమండ్రి రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రెండో పట్టణ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు. డీఎస్పీ శ్రీలత వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో దేవలేశ్వరం పిన్నింటివారి వీధికి చెందిన గుడే పవన్కుమార్, తాడితోట వీరభద్రనగర్ కి చెందిన ఎర్రారపు సత్యనారాయణ అలియాస్ చిన్నా, అదే ప్రాంతానికి చెందిన గుత్తాల నవీన్ కుమార్ ఆలియాస్ లీ అనే వ్యక్తులను స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా రాజమండ్రి ఒకటి, రెండు, మూడు, ప్రకాశంనగర్, బొమ్మూరు, దవలేశ్వరం, మండపేట, అనపర్తి, అమలాపురం, కాకినాడ, భీమవరం,గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ద్విచక్రవాహనాల చోరీలు చేసినట్లు గుర్తించారు. డీఎస్బీ శ్రీలత ప్రాథమిక విచారణలో తేలింది. వీరిలో పవన్ కుమార్,సత్యనారాయణలు సుమారు 20కి పైగా చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. నిందితుల నుంచి మొత్తం 31 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సై ను మరియు సిబ్బంది.ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అభినందించారు.