ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన.ఎమ్మెల్యే గోరంట్ల


 TV77 తెలుగు  రాజమండ్రి :

ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? నియంతృత్వ పోకడలో ఉన్నామా

న్యాయవ్యవస్థకు కళంకు రాకుండా ఉండాలంటే హైకోర్టు జడ్జ్ రాజీనామా చేయాలి.

ముఖ్యమంత్రి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి  పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వారి నివాసం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక, ఆటవిక పరిపాలన సాగుతుందని వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు  వాళ్ళ అధికారం కోసం ముఖ్యమంత్రిని నిత్యం భజన కార్యక్రమాలతో వారిని కొనియాడుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఫ్రస్టేషన్ లోకి వెళ్తున్నారు అని బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ వన్ ద్వారా ప్రతిపక్షాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారు.అని ఈ ముఖ్యమంత్రి సారధ్యంలో సంక్షేమ పథకాలు గాలికి కొట్టుకుపోయాయి.అని ఈ ముఖ్యమంత్రి తన సొంత డబ్బా తను కొట్టుకుంటున్నాడు.అని గోరంట్ల మండిపడ్డారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం హత్య రాజకీయాలు చేశారు అని,కోడి కత్తితో ప్రమాదాన్ని సృష్టించి ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేశారని,రాష్ట్రాన్ని బ్రష్టు పట్టుకుపోయిన వ్యవస్థల తయారు చేశారు అని అన్నారు.ఇళ్ల పట్టాల పేరుతో పేదలను దగా చేశారు అని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు అనేక చోట్ల ఇళ్ల నిర్మాణం  ఇంకా ప్రారంభం కాలేదు అని ఎక్కడికక్కడ  ఇసుక,మట్టి దోచుకు తింటున్నారు అని రాజమండ్రి కార్పొరేషన్ కు ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా జమకాలేదు అని రాజమండ్రి అభివృద్ధిపై ఎంపి బ్రమలో ఉన్నారు అని విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం అని కులాలను మతాలను ప్రాంతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు అని,అవినాష్ ను అరెస్టు చేస్తే ఆందోళన లు చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. చంద్రబాబుకు లోకేష్ కు ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వస్తోంది అని గోరంట్ల అన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండల టిడిపి అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, పండూరి అప్పారావు,వాసిరెడ్డి బాబీ,వల్లేపల్లి ప్రసాద్,జల్దీ కృపారావు తదితరులు పాల్గొన్నారు.