TV7 7తెలుగు సీతానగరం :
సారా కేసులో నిందితులను,
పట్టుబడిన వాహనాలు వదిలేసిన వైనం ...
విధి నిర్వహణలో ఎన్నో అవినీతి ఆరోపణలు
గోదావరి ఏటిగట్టు ప్రాంతంలో కీలకమైన సీతానగరం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహించడం కత్తి సాముల ఉంటుంది. ఈ ప్రాంతంలో కొండలు, కోనాలు గోదావరి నది ఉండడంతో స్మగ్లర్లకు ఇసుక మట్టి కోడిపందాలు, మాఫియాలకు, వంటి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. అయితే ఇక్కడ విది నిర్వహణలో ఉండే పోలీసు అధికారులు మరింత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సిన తరుణంలో అవినీతి అక్రమాలకు అలవాటు పడి పోలీస్ వ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకాన్ని ,విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శలున్నాయి.ఈ నేపథ్యంలో మరోసారి సీతానగరం పోలీస్ స్టేషన్ వార్తలకు ఎక్కింది ముడుపులకు ఆశపడి విధుల్లో దుర్వినియోగాని కి ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్ శుభశేఖర్ పై ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు రామన్నపాలెం చెందిన వీరబాబు ,నారాయణ, పండు అనే ముగ్గురు వ్యక్తులు 50 లీటర్ల సారా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డారు ఈ కేసులో నిందితుల వద్ద ముడుపులు తీసుకుని పట్టుబడిన ముగ్గురిలో ఇద్దరిని నిందితులను, పట్టుబడిన వాహనాలను వదిలేసినట్టుగా ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో శాఖా పరమైన విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ చెందిన ఒక కానిస్టేబుల్ సైతం ఎస్సై వ్యవహరించిన చర్యను వ్యతిరేకించారు . దాంతో సంబంధిత కానిస్టేబుల్ పై కూడా నిందితులతో ఒక తప్పుడు కేసు పెట్టించినట్లుగా ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. విదినిర్వహణలో ఎస్సై ప్రదర్శిస్తున్న అలసత్వంపై పోలీసు ఉన్నత అధికారులు ఇప్పటివరకు ఐదు పోస్టుమెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ను నిలిపివేసేలాగా ఐదు ఆరు చార్జి మోమెలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అవినీతి ఆరోపణల పై ఎస్ఐ శుభసేకరు సస్పెండ్ కావడంతో మండల ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.