ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజుల పాటు వర్షాలు


 TV77 తెలుగు అమరావతి:

 రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణితో పాటూ నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారం వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.జాగ్రత్తగా ఉండాలని సూచించింది.