స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల విభాగంలో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అదనపు భారం


 TV77 తెలుగు అమరావతి :

 రాష్ట్రవ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం పరిధిలో జారీచేసే ధృవీకరణ పత్రాలకు యూజర్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ మేరకు ఆఘమేఘాలపై ఆదేశాలు జారీ అయ్యాయి. పెరిగిన చార్జీల ప్రకారం మార్కెట్ విలువ ధృవీకరణ పత్రానికి రూ.50గతంలో రూ. 10 ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్)కు రూ.100 గతంలో రూ. 10 యూజర్ చార్జీలు నిర్ణయించారు. దీంతోపాటు లక్ష రూపాయల లోపు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రూ. 50 స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని ఆదేశించింది. లక్ష రూపాయలకు పైబడితే వంద రూపాయల స్టాంపు, వీలునామాలు, గిఫ్ట్ డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు సేల్ డీడ్లకు రూ. 500 చొప్పున ఇకపై యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు. గత కొద్దికాలం క్రితమే రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. తాజాగా యూజర్ చార్జీల పెంపు సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అదనపు భారం కానుంది.మంగళవారం యథా ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యూజ చార్జీలు వసూలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ప్రభుత్వం చార్జీలను పెంచిందని ఈ క్షణం నుంచే వాటిని అమలు చేయాలని ఆదేశించిందని సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందికి సూచనలిచ్చారు.