TV77 తెలుగు రంపచోడవరం :
గంజాయి కేసులో పరారైన మోతుగూడెం ఎస్సై సత్తిబాబు కోసం రంపచోడవరం ఏఎస్పీ ఆధ్వర్యంలో గాలిస్తున్నట్లు చింతూరు ఏఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎస్సైను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు. ఈ కేసులో తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన బాలమురళీకృష్ణ, సురేష్ తో పాటు ఎస్సైపై కేసు నమోదు.