అధిక వడ్డీ ఆశ చూపించి కోటి రూపాయలతో వ్యక్తి పరార్


 TV77 తెలుగు పెద్దాపురం :

కాకినాడ జిల్లా పెద్దాపురం చిట్టీలు, అధిక వడ్డీ ఆశ చూపించి ఓ వ్యక్తి రూ.కోటికి టోకరా వేసిన ఘటన కట్టమూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన రాసంశెట్టి శివ గ్రామంలో చిట్టీలు నిర్వహిస్తూ, గ్రామస్తుల నుంచి సొమ్ములు వసూలు చేశాడు. అతడిని నమ్మి పలువురు వారి అవసరాలకై చిట్టీ వేశారు. ఈ నేపథ్యంలో శివ కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడంటూ గ్రామస్తులు పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.