TV77 తెలుగు హైదరాబాద్ :
హైదరాబాద్ సనత్నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ 8ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చింది. నిన్న అమావాస్య కావడంతో అబ్దుల్ వహీద్ అనే బాలుడిని అల్లాదున్ కోటి ఏరియాలో నరబలి ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో లభించింది. విషయం తెలుసుకున్న స్థానికులు మహిళ ఇంటిపై దాడిచేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.