విద్యార్థిపై మరో విద్యార్థి క్లాస్ రూమ్ లో కత్తితో దాడి


 TV77 తెలుగు రాజానగరం:

పరీక్ష రాస్తున్న విద్యార్థిపై మరో విద్యార్థి క్లాస్ రూమ్ లో కత్తితో దాడి 

గాయాలు పాలైన విద్యార్దిని ఆసుపత్రి కి తరలింపు

చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీ.జే.సీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి

తొమ్మిదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థి పై అదే తరగతి చదువుతున్న మరో విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉపాధ్యాయుడు, విద్యార్థులు చూస్తుండగానే కత్తితో దాడి చేసిన సంఘటన సంచలనం కలిగించింది. రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న పెంకే శ్రీహరి సాయి ప్రసాద్ గురువారం సప్లమెంటరీ పరీక్షలు ఉండడంతో పరీక్షకు రాసేందుకు క్లాస్ రూమ్ కి వెళ్ళాడు. క్లాసుములు పరీక్ష రాస్తున్న పింకీ శ్రీహరి సాయిప్రసాద్ పై 9వ తరగతి చదువుతున్న ఉదయ శంకర్ తనతో తెచ్చుకున్న చాకుతో తరగతి గదిలో అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు, క్లాస్ రూమ్ లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు అడ్డుకుంటున్నప్పటికీ వారిపై కూడా దాడి చేసిందుకు శంకర్ ప్రయత్నించాడని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ దాడిలో గాయాలు పాలైన శ్రీ హరి సాయి ప్రసాద్ ను చికిత్స నిమిత్తం రాజానగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైప చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం లోని సాయి హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు విద్యార్థికి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. 

గాయాలు పాలైన విద్యార్థి కి మెరుగైన ఏమి చికిత్స అందించాలి : జక్కంపూడి విజయలక్ష్మి

విద్యార్థి దాడిలో రాయలపాలై ఆస్పత్రిలో చికిత్స


పొందుతున్న పెంకె శ్రీ హరి సాయి ప్రసాద్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్థిపై కత్తితో దాడి చేసిన సంఘటన తీసుకున్న ఆమె గాయాలపై చికిత్స పొందుతున్న పెంకే శ్రీహరి సాయిప్రసాద్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. తన కుమారుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ప్రసాదును పరామర్శించేందుకు వచ్చానని పేర్కొన్నారు. బాలుడికి పెరిగిన వైద్య సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాలుడు కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.