బస్సు ఢీ కొని మహిళ దుర్మరణం


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

బస్సు ఢీకొని మహిళ దుర్మరణం పాలైన ఘటన లాలాచెరువు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం  చోటుచేసుకుంది. సుమారు 2:30గం ల సమయంలో దివాన్ చెరువు నుండి రాజమహేంద్రవరం వైపు స్కూటీ పై వస్తున్న మహిళను లాలచెరువు  ఫారెస్ట్ ఆఫీసు సమీపంలో జాతీయ రహదారిపై  వెనక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలు పాలై ఘటనాస్థలంలో మృతి చెందింది. బొమ్మూరు పోలీసులు అక్కడకు  చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.