తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ


 TV77 తెలుగు తిరుమల :

  వారాంతపు సెలవులు కావడంతో కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 72,631 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 38,529 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.85 కోట్ల ఆదాయం టీటీడీ  తెలిపింది.