సీతానగరం మండలంలో జనసేన సమావేశం లో బత్తుల


 TV77 తెలుగు రాజానగరం:

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు  బత్తుల బలరామకృష్ణ  ఆధ్వర్యంలో సీతానగరం పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో చేయవలసిన భవిష్యత్ కార్యాచరణ గురించి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో చర్చించి వారికి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ  మాట్లాడుతూ  అందరు కలిసి పనిచేసి రాజానగరం నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మార్చి రాజానగరం జనసేన పార్టీ సత్తాని చాటుదాం అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది.