TV7 7తెలుగు తిరుమల:
ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ మరియు నూతన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కలిసి మ్రొక్కుబడులు చెల్లించుకున్న మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ దంపతులు మరియు తూర్పు రాయలసీమ నుంచి నూతనంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్ దంపతులు, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ముత్యాలరావు దంపతులు.దర్శనానంతరం నూతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆలయం బయట విలేకరులతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని, దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి పట్టం కట్టారని, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైయస్సార్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అసెంబ్లీలో అడుగు పెడతారని రాజేంద్రప్రసాద్ అన్నారు. నూతన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చం నాయుడు అలాగే నాకు ఓటు వేసి గెలిపించిన తూర్పు రాయలసీమ పట్టభద్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కంచర్ల శ్రీకాంత్ అన్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సెక్రెటరీ వానపల్లి ముత్యాలరావు, చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.