TV77 తెలుగు రాజస్థాన్ :
రాజస్థాన్లో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు,నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించిన ఆ శిశువు 20 నిమిషాల్లోనే చనిపోయింది. హజారీ సింగ్ అనే మహిళ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ చేశామని, నవజాత శిశువుకు ఒక తల, 2 గుండెలు,2 వెన్నుపాములు, 4 కాళ్లు, 4 చేతులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. 20 నిమిషాలు సజీవంగా ఉన్న ఆ శిశువు కాసేపటికే చనిపోయిందని చెప్పారు.