TV77 తెలుగు రాజమండ్రి రూరల్
120 కేజీల గంజాయి స్వాధీనం
రెండు వాహనాలు సీజ్
ఏడుగురు ముద్దాయిలు అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి రూరల్ మండలం హుక్కంపేట పంచాయతీ పరిధిలో మూడు గుడులు వీధిలో ఒక ఇంటిలో రహస్యంగా గంజాయి ప్యాకెట్లు తయారు చేస్తున్నారని సమాచారంతో బొమ్మూరు పోలీసులు ఆ ఇంటిపై బుధవారం దాడి చేసి ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఒక బొలెరో వాహనం, టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని బొమ్మూరు సిఏ ఆర్ విజయ్ కుమార్ తెలిపారు.