అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు జీవో నెంబర్ 1 రద్దు చేసే వరకు పోరాటం ఆగదు :సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు


 TV77తెలుగు రాజమండ్రి :

రేపు విజయవాడ కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

మానవ హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావు  ముందుస్తు అరెస్ట్  దారుణం 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 మందికి ముందస్తు నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్రజాస్వామిక  జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని కోరుతూ 20 తేది జరపతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంన్ని భగ్నం చేయడం కోసం సిపిఐ వివిధ ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం దారుణమని వీటితో ఉద్యమాలను ఆపలేరని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. ఆదివారం మధ్యాహ్నం సిపిఐ కార్యాలయానికి పోలీసులు విచ్చేసి విజయవాడ వెళ్తున్న నాయకులను అడ్డగించారు. అంతేకాకుండా సిపిఐ నాయకులు తాటిపాక మధు కొండ్రపు రాంబాబు వీ కొండలరావు చప్ప రమణ ఎమ్మెస్ రాజు దేవుడు తదితర నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తీసుకొచ్చి జగన్ ప్రభుత్వం ప్రజలను బయోందనలు గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ప్రజలు రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉద్యమాలు చేపడుతున్నారని ఉద్యమాలకు భయపడిన జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మానవ హక్కులనేత ముప్పాళ్ళ సుబ్బారావు ను ముందస్తు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అమలాపురం ముమ్మిడివరం రామచంద్రపురం కాకినాడ తుని పెద్దాపురం తదితర ప్రజాసంఘాల పార్టీల వామపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.