TV 77తెలుగు రాజమండ్రి రూరల్ :
రాజమండ్రి రూరల్ వార్డుల వైస్సార్సీపీ కన్వీనర్లు, గృహ సారధుల సమావేశం రాజమండ్రి రైల్వే స్టేషన్, రిలయన్స్ ట్రెండ్స్ ఎదురు వీధి లో మునిసిపల్ కమ్యూనిటీ హాల్ నందు మండలం ఇంచార్జి, వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, విశిష్ట అతిధులుగా నియోజక వర్గ పరిశీలకులు, మాజీ శాసన మండలి సభ్యులు మేక శేషుబాబు, జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు.చందన మాట్లాడుతూ జగన్ అన్న ఇచ్చిన పథకాలు మరియు నాడు నేడు స్కూల్స్ ఆధునీకరణ,హాస్పిటల్స్ పునీరుధీకరణ ఒకప్పుడు ప్రభుత్వం తో పొల్చుకుంటే ఈ ప్రభుత్వ నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి ప్రతి గ్రామం లో హాస్పిటల్ సదుపాయాలు మన ప్రభుత్వం తోనే సాధ్యం అని చందన తెలిపారు.వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, అమ్మ ఒడి, ఆసరా, చేయూత ప్రజలకు అవసరం అయిన అన్ని పధకాలు అమలు చేసిన ఘనత మన జగనన్న దే. ఈ సంక్షేమ పథకాలు అన్నీ మళ్లి కొనసాగలంటే జగన్ అన్న మళ్ళీ సిఎం ఐతేనే సాధ్యం అవుతోంది కావున మన భవిష్యత్తు మన జగన్ అన్నఅని మేక శేషుబాబు గారు అన్నారు. జగన్ అన్న మళ్ళీ సిఎం ఐతే ఇవే పథకాలు మళ్లీ ఇస్తారని నమ్మకం జగనన్న తోనే సాధ్యం అని డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు అన్నారు.మా నమ్మకం నువ్వే జగన్ అన్న. ఎటువంటి సమస్య లేకున్నా పంపిణీ చేస్తున్నాం అంటే జగన్ అన్న పెట్టిన సచివాలయం వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైంది. ఇన్ని పథకాలు కొన్ని లక్షల మందికి వివిధ పధకాల రూపంలో ఇస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ అన్న చాలా అడ్వాన్స్డ్ ఆలోచించి అన్ని కుల వర్గాలకు న్యాయం చేస్తు అందరికి లబ్ది చేస్తున్నారు. కాబట్టి అన్ని కుల వర్గాలకు న్యాయం జరగాలంటే సీఎం జగన్ అన్న వల్లే సాధ్యం. ఈ కార్యక్రమంలో మండలం జె.సి.యస్ కన్వీనర్, ఇన్నిసుపేట కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ అన్నపూర్ణ రాజు, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బిల్డర్ చిన్నా, ఇంచార్జిలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..