TV77తెలుగు రాజమండ్రి రూరల్ :
కడియం మండలం, మురమండ గ్రామంలో సచివాలయం 1, 2 వ రోజు, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్.జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు అందిన వారందరికీ ధ్రువ పత్రాలు అందచేసి, రానీ వారికి ఎందుకు రాలేదని వివరాలను సంబంధిత వాలంటీర్ మరియు సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకుని, అర్హులు అయితే వెంటనే పధకాలు వచ్చేలా చేయాలనీ ఆదేశించిన చందన.అలాగే లబ్ధిదారులు అందరిని తనని మరియు ముఖ్యమంత్రి ని దీవించాలని కోరారు.మురమండ గ్రామంలో ఎన్నాళ్ల నుండో ప్రధాన సమస్యగా వున్న రహదారి మరమ్మత్తుల పనులు దగ్గర ఉండి పరిశీలించిన చందన.గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ సందర్శించి, కొన్ని మరమ్మత్తులు చేయించాలని ఎస్టిమేట్స్ వేసి వెంటనే ఎండిఓ కి తక్షణమే అందచేయ్యాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.పిల్లలతో ముచ్చటించిన చందన మీకు ఇవన్నీ ఎవరు సమాకూరుస్తున్నారు అని అడగ్గానే ఏకకంఠం తో జగనన్న అని అనడంతో అందరూ పిల్లలను అభినందించారు.అంగన్వాడీ కేంద్రం కూడా సందర్శించిన చందన, పిల్లలకు పెడుతున్న భోజనం రుచి చుసిన చందన.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుక్మిణి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మెలిమి మంగ గంగరాజు, గ్రామ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దీన్ దయాళ్, డైరెక్టర్ కొత్తపల్లి రాము, వీవర్స్ సొసైటీ చైర్మన్ ఎర్రా సత్యనారాయణ, కన్వీనర్లు కొప్పాక రమణ, బిల్లకూర్తి గంగాచలం, పైడిమల సత్య కుమారి, వెంపటి గంగారావు, పల్లి హేమలత, బీరక మహేష్, సాప్ డైరెక్టర్ నాగేంద్ర, వ్యవసాయ కమిటీ సభ్యులు ఈలి గోపాలం, ఎంపీటీసీ ఊటుకూరి శైలజ, ఎంపీడీఓ రత్నకుమారి, ఈఓ.పి.ఆర్.డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.