నరవ గోపాలకృష్ణకు అండగా ఉంటాం : జక్కంపూడి గణేష్


TV77telugu రాజమహేంద్రవరం, జనవరి 26: 
 

సస్పెన్షన్ ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్తాం

పార్టీ విజయానికి నరవ కృషి చేస్తారు

వైకాపా యువనేత జక్కంపూడి గణేష్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,10 వ వార్డు ఇన్చార్జి నరవ గోపాలకృష్ణకు అండగా ఉండి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని ఆ పార్టీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ చెప్పారు. గోపాలకృష్ణ తమ తండ్రి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కు అనుంగ్య శిష్యుడు, ప్రధమ అనుచరుడు,  సోదరుడిలా ఉండేవారని, తమ తండ్రితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వైకాపా కష్ట కాలంలో ఉన్నప్పుడు నరవ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి విషయంలో జరిగిన దానిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళి నరవకు న్యాయం జరిగేలా చేస్తానన్నారు. అలాగే పార్టీ విజయానికి నరవ గోపాలకృష్ణ కృషి చేస్తారని గణేష్ అన్నారు. నరవ గోపాలకృష్ణ పార్టీ కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పని చేస్తారని తెలిపారు.