అభివృద్ధిని సొంత లాభాలకు మనుకుంటున్న పాలకులకు జె జె లు కొట్టడం దారుణం. మేడా శ్రీనివాస్, ఆవేదన


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

ఆంధ్రప్రదేశ్ కు ప్రజల పక్షాన నిలబడే మీడియా కావాలి. 

ఆంధ్రప్రదేశ్ ను ఎడారిగా మార్చటమే మోది, చంద్రబాబు, జగన్ ల ధ్యేయం. 

మన రాష్ట్రం, మన దేశం కన్నా కులం, మతం, సినిమా లు ఎక్కువ కాదు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం జరగకపోతే ఆంధ్రులకు భవిష్యత్ లేదు. 

కేంద్రంలో మోదికి, ఏపిలో జగన్ చంద్రబాబు లకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్ బాయ్ చెప్పకపోతే బిక్షాన్ధ్రప్రదేశ్ గా మారటం ఖాయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, ఏపిలో గల ప్రధాన మీడియా అంతా చంద్రబాబు, జగన్ చుట్టూ తిరుగుతూ రాష్ట్ర సమస్యలపై ద్రుష్టి సారించ లేకపోతున్నారని, ఆ రెండు పార్టీల వర్గపోరుకు అధిక ప్రాధాన్యతను ఇస్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను గాలికివదిలేస్తున్నారని,విభజన అనంతరం రాష్ట్ర భవిష్యత్ ఏ విధంగా దిగజారిపోతుందో ప్రధాన కార్పొరేట్ మీడియాకు కనపడక పోవటం దురదృష్టం అని, మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు అమలు చేయాల్సిన హామీలపై ప్రధాన మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం విశ్మరిస్తు బూతు పురాణాలకు, వర్గ పోరుకు, తెరమీద హీరో నట వేషగాళ్ళ మాటలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తు దోపిడీదారులను  ముసుగు వేసి దాస్తున్నారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ అమలు పై ప్రధాన మీడియా భాద్యతల నుండి   తప్పించుకుంటున్నారని ,నిరంతరం  జగన్ చంద్రబాబుల మధ్య వర్గపోరును ఎక్కువచేస్తు పదే పదే చూపిస్తు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని,నానిల , భూతులనే వారి మీడియాలో చూపిస్తు ఇండ్లలో సాంప్రదాయక వాడుక పదాలు మరిచిపోయేలా చేస్తున్నారని,జగన్, చంద్రబాబు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను నాశనం చేస్తుంటే, ప్రధాన మీడియా బజారున పెడుతుందని, ఎంతో అనుభవం గల సీనియర్ జర్నలిస్టులు సైతం ప్రధాన కార్పొరేట్ మీడియాలో చేరిన తదుపరి మీడియా విలువలను, భాద్యతలను మరిచి వ్యవస్థ కలుషితానికి కారకులైతున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఎంతో విలువైన సహజ సంపద గల ఆంధ్రప్రదేశ్ ను రాజకీయ అవసరాలకు దోచిపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, మన రాష్ట్రంలో రాజకీయ వివాదాలకు, శాంతి భద్రతల సమస్యలకు నిత్యం ఆజ్యం పోస్టున్నారని, మన రాష్ట్రంలో గల ప్రధాన రాజకీయ పక్షాల అవినీతి కుంభకోణాలను మన నేతలకు బూచిగా చూపిస్తు ఆంధ్రప్రదేశ్ ను ఎడారిగా మారుస్తున్నారని, అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ ను బిక్షాన్ద్రప్రదేశ్ గా మార్చటమే మన పాలకుల కర్తవ్యంగా వుందని, మోది ఎంతో వ్యూహాత్మకంగా చంద్రబాబు, జగన్ లతో కబ్బాడి ఆట ఆడిస్తున్నారని, ఆ ఆటలో ఎవరు గెలిచినా మోది వద్ద శునక విశ్వసం తోనే ఉంటారనేది నగ్న సత్యం అని, కేంద్రంలో మోది సర్కార్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ చంద్రబాబు ల పాలన వున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడవని, మోది, జగన్, చంద్రబాబు లకు వ్యతిరేకంగా ఆంధ్రులు ఓటు హక్కు వినియోగించుకున్న నాడే ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్ అని ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కొన్ని శక్తులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై విషం చిమ్ముతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో కుల, మత ఉన్మాదులు గ్రామాల్లో వివాదాలకు కుట్రలు చేస్తున్నారని, ఎక్కువగా కొంతమంది సినిమా ప్రముఖులు ఈ తరహా కుల వివాదాలకు ఆజ్యం పోస్టు యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్నారని, వెండితెర మీద కనపడే నిజాయితీ, హీరోయిజం, విలువలు బయట సమాజంలో ఆ హీరోల్లో కనీసం  కనపడవని, ఆంధ్రాలో యువత భవిష్యత్ ను పాడుచేసుకోవటానికి చాలా వరకు సినిమా ప్రభావమే  కారణమని, కొంతమంది సినిమా హీరోలు తల్లిదండ్రులను గౌరవించటం చేతకాదు గాని నీతులు చెబుతు అమాయక ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని, మన రాష్ట్రంలో మెరుగైన విద్యా శాతం తగ్గటానికి అత్యధిక శాతం కొంతమంది సినీ హీరోలే కారణమని, యువతలో మన రాష్ట్రం, మనదేశం, మన ప్రాంతం అనే కమ్మిట్మెంట్ లేకుండా యువతను ఒక రకమైన మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని, పాలనను అవినీతి మయంగా మారుస్తు వ్యవస్థను కలుషితం చేస్తు ప్రజలకు ప్రజా స్వామ్యం పై నమ్మకం లేకుండా చేస్తున్నారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. అభివృద్ధి ని సొంత లాభాలకు తాకట్టు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు, జగన్ ల ఆధిపత్య పోరుకు అంకితం చేస్తున్నారని, ప్రజల శ్రమను దోచుకుంటున్న నేతలకు ప్రజలతోనే జె జె లు కొట్టించుకుంటు ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తున్నారని, ఒకప్పుడు పాలకులు అంటే సంఘ సేవకులని, నేడు పాలకులంటే సంఘ విద్రోహులనే భావన తీసుకొస్తున్నారని, పాలన ఘాడి తప్పటం కారణంగా ప్రభుత్వ వ్యవస్థలు కలుషితం అయిపోయాయని,నేడు ప్రభుత్వ విధులు అంటే వేధించటం, శిక్షించటమేనని, హక్కులను ప్రశ్నించే వారిని భయపెట్టడమేనని, ఈ తరహా పాలన భావితరాల భవిష్యత్ కు అత్యంత ప్రమాదకరం అని, ఆంధ్రప్రదేశ్ ను పట్టి పీడిస్తున్న అవినీతి పాలనను అంత మొందించటమే లక్ష్యంగా ఆంధ్రులు నడుం బిగించాలని, అందుకు నేను సైతం అంటు జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటు నినందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా రాజకీయ బలహీనతలను విడనాడి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, భద్రత, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఆంధ్రులు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, ఆంధ్రప్రదేశ్ ను యుద్ధ ప్రాతిప్రదికన అభివృద్ధి పదంలో నడిపించాలంటే జగన్, చంద్రబాబు లకు గుడ్ బాయ్ చెప్పాలని, మోదికి భజన చేస్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి మోకాలు అడ్డుపెడుతున్న కోవర్ట్ లకు ఆంధ్రులు తగిన గుణపాఠం చెప్పాలని, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయం ఉద్యమ నిర్మాణానికి ఆంధ్ర సంపన్నులు, మేధావులు, యువత  నడుంబిగించాలని, 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు దోపిడి పాలకులకు కు మధ్యనే జరుగుతాయని, ఓటర్లు అప్రమత్తంగా వుండి ఓటు హక్కును ఈ లకు వ్యతిరేకంగా  వినియోగించుకోక పొతే ఆంధ్రప్రదేశ్ కు  అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉద్బవిస్తాయని, ప్రస్తుత ప్రధాన రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్ ను బిక్షాన్ద్రప్రదేశ్ గా మార్చి ప్రజలను గొర్రెలు మాదిరి పాలించే విధంగా రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారని, ఆంధ్రులారా చేయి చేయి కలుపుదాం, ఆంధ్ర హైదరాబాది పాలకులను సాగనంపుదాం అని, ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ కు ఆంధ్రులు సిద్ధపడాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,కాసా రాజు,  లంక దుర్గాప్రసాద్,, సిమ్మా దుర్గారావు,ఎండి హుస్సేన్ ,  దుడ్డె సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , వల్లి శ్రీనివాసరావు, కంచెర్ల సత్యనారాయణ, బత్తిన రమణ, కోమర్తి గోపి శ్రీనివాసరావు,మట్టపర్తి తులసీరావు ,  సూరంపూడి వెంకటేశ్వరరావు, బత్తుల సూర్యనారాయణ , మండవల్లి వెంకటేశ్వరరావు , మండవల్లి సూరిబాబు , మండవల్లి శంకర్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , మేకల కిరణ్ కళ్యాణ్  తదితరులు పాల్గొనియున్నారు.