శ్రీ మహాలక్ష్మి పూజా మహోత్సవాలలో పాల్గొన్న ఎంపీ భరత్ దంపతులు


 TV77 తెలుగు రాజమహేంద్రవరం :

సమస్త జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి 

  శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం నగరంలోని గోదావరి గట్టు సరస్వతీ ఘాట్, సరస్వతీ పీఠంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి పూజా మహోత్సవంలో ఎంపీ భరత్ రామ్ ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎంపీ భరత్, మోనా దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సరస్వతీ పీఠంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆ సమీపంలోనే ప్రతిష్ఠించిన యాబది రెన్డు అక్షర మాలిక దేవాలయంలో అమ్మవారికి ఎంపీ భరత్ దంపతులు శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. హోమాది క్రతువుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ శరన్నవరాత్రులలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందన్నారు. ప్రపంచంలో మానవాళి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని ఆ జగన్మాతను ప్రార్థించినట్టు ఎంపీ భరత్ తెలిపారు.