TV77 తెలుగు కాకినాడ:
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేరుతో సైబర్ గాళ్లు మోసం చేశారు. కలెక్టర్ డీపీతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి జిల్లా అధికారులకు సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పెట్టారు. అర్జంటుగా డబ్బులు కావాలని మెసేజ్ పెట్టడంతో.. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే కలెక్టర్ కృతికా శుక్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. యూపీకి చెందిన నెంబర్ నుంచి మెసేజ్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.