TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నక్కపల్లి శామ్యూల్ అన్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ సుబ్బారావు నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 5వ నంబర్ బస్టాండు, కోరుకొండ రోడ్, రాజా థియేటర్ ఏరియాల్లో అంతరాయం కలుగు తుందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పనసచెట్టు సెంటర్, సంజీవ్ నగర్ ఏరియాల్లో సరఫరా ఉండదన్నారు.