'ఉగ్రం' చిత్ర షూటింగ్ ప్రారంభం
iraila 06, 2022
ఉగ్రం చిత్ర ప్రారంభం చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 5గా నిర్మిస్తున్నారు. మిర్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. నాంది చిత్రానికి పని చేసిన దాదాపు అదే సాంకేతిక బృందం 'ఉగ్రం'లో భాగమైంది. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిట్ చేయనున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి..