TV77తెలుగు రాజమహేంద్రవరం :
లోనయాప్స్ వేధింపులు తాళలేక రాజమహేంద్రవరంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శాంతినగర్కు చెందిన దుర్గ లోన్ప్లో అప్పుగా నగదు పొందారు.సకాలంలో చెల్లించకపోవడంతో భార్య రమ్యలక్ష్మి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. దీంతో కుటుంబ పరువు పోతుందని భయపడిన దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.