అభిమానులుకు మీ కృష్ణంరాజు ఇక సెలవ్


 TV77తెలుగు జూబ్లీహిల్స్‌ :

అభిమానులు కన్నీటి వీడ్కోలు  రెబ్‌ స్టార్‌ కృష్ణం రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కృష్ణం రాజు మరణంతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో.బాధపడ్డ ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటివద్ద ఉంచిన భౌతికకాయానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ నుంచి మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి.ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఒంటిగంట తర్వాత జూబ్లీహిల్స్‌ నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రకు రోడ్డు పొడవునా అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇక తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఫామ్‌ హౌజ్‌కు వచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో పార్థివదేహాన్ని సందర్శించుకోలేకపోయిన సినీ ప్రముఖులు కృష్ణం రాజు చివరి చూపుకోసం మొయినాబాద్‌కు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.