TV77 తెలుగు కాకినాడ:
కాకినాడలోని రమ్య ఆస్పత్రి డాక్టర్లు డబ్బుల కోసం ఓ మహిళ ప్రాణాలతో చెలగాటమాడారు. మహాలక్ష్మి అనే మహిళ టెస్టుల కోసం వెళ్లగా గర్భవతి అని రిపోర్ట్ ఇచ్చారు. మందులు, టెస్టుల పేరుతో వేల రూపాయలు దండుకున్నారు. 9 నెలల తర్వాత ప్రసవం కోసం ఆమె తల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లడంతో మహాలక్ష్మి అసలు
గర్భవతే కాదనే నిజం బయటపడింది. రమ్య ఆస్పత్రి మందులతో తమ కూతురి పొట్ట పెరిగిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.