TV77తెలుగు రాజమహేంద్రవరం :
మోడీ ప్రభుత్వం చేపడుతున్న ద్రుష్ట కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక నేత సిపిఐ సీనియర్ నాయకులూ చిట్టూరి పోరాట స్పూర్తితో కార్మిక లోకం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు తెలిపారు . బుధవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయము లో కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదిరి శత జయంతి సందర్బంగా మోడీ ప్రభుత్వ విధానాలు -కార్మిక కర్తవ్యాలు అనే అంశం పై జిల్లా సదస్సు జరిగింది . దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు .ముందుగా అయన చిత్రపటానికి నాయకులూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .జి ఓబులేసు మాట్లాడుతూ మోడీ విధానాలతో అన్ని రంగాలు పూర్తిగా బ్రష్టు పట్టుపోయావని అన్నారు .బతకదానికి అవకాశం లేక ప్రజలు ముఖ్యగా యువకులు విలవిలా లాడుతున్నారని అన్నారు .మోడీ అధికారం లోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చారని అన్నారు 30 రోజుల్లో ధరలు తగ్గిస్తామని ,100 రోజుల్లో నల్ల ధనం విదేశాలు నుండి తీసుకు వస్తానని ,ఉద్యాగాలు ఇస్తానని చెప్పి అధికారం లోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా వున్న ప్రభుత్వ రంగాలను బడా కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం చేసారని అన్నారు .కార్మిక లోకాన్ని చతన్యం చేసి మోడీ నుండి గద్దె దింపాలని ఓబులేసు పిలుపు నిచ్చారు .సిపిఐ సీనియర్ నాయకులూ సి స్టాలిన్ ,ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఆయనను ఎంత పొగిడిన అంతం ఉండదని అన్నారు .వ్యక్తిగత లాభాలు చుడకుండా ప్రజల ప్రయోజనాలకు పాటు పడే వ్యక్తి చిట్టూరి అన్నారు .ఇంకా ఈ సమావేశము లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ,జట్ల సంఘము అధ్యక్షులు కుండ్రపు రాంబాబు ,ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి బి వి వి కొండలరావు ,సిపిఐ నగర కార్యదర్శి తాటిపాక మధు ,సహాయ కార్యదర్శి లు సప్ప రమణ ,బి .రవిచంద్ర ,మహిళా సమాఖ్య నాయకురాలు నల్ల భ్రమరాంబ ,సేపిని రమణమ్మ ,యడ్ల లక్ష్మి ,కోనసీమ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాము ,,సంఘము ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్ల రామారావు AISF, సునీల్ ఏఐటీయూసీ నాయకులూ కిర్ల కృష్ణ ,రామకృష్ణ ,రామారావు గుమ్ములూరి సత్యనారాయణ ,బల్లిన రాము ,అప్పారావు ,హరినాధ్ తదితరులు ప్రసంగించారు .