జగనన్న చేయూత అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్


 TV77 తెలుగు కుప్పం :

 వైయస్సార్ చేయూత పథకం కింద 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున రూ.4,949 కోట్లను కుప్పం సభలో సీఎం జగన్ జమ చేశారు.ఇప్పటికే 2 విడతల్లో రూ.9,161 కోట్లు అందించారు.ఇప్పుడు మూడో విడతతో కలిపి రూ.14,110.62 కోట్లు మహిళల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈపథకానికి 45-60 ఏళ్ల వయసున్న SC, ST, BC, మైనార్టీ మహిళలు అర్హులు కాగా మొత్తం 4 విడతల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.75వేలు అందజేస్తోంది.