TV77 తెలుగు రాజమహేంద్రవరం :
ఎంపీ భరత్ రామ్ సమక్షంలో అనుచరులతో చేరిక
24 వ వార్డు అభివృద్ధికి కృషి
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా వ్యవహరించిన 24 వ వార్డు నాయకుడు. రామ్ సాయి ఫైనాన్స్ అధినేత యిన్నమూరి ప్రదీప్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక చందా సత్రంలో సోమవారం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ సమక్షంలో ప్రదీప్ అనుచరులతో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి. అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల లో ఉన్నవాళ్లు వైసీపీలోకి వస్తున్నారని అన్నారు. 24 వ వార్డు సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి యిన్నమూరి ప్రదీప్ ను సంప్రదించాలని తన వంతు సహకారం అందిస్తారని ఎంపీ భరత్ రామ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాలిక శ్రీనివాస్. నందిపు శ్రీనివాస్. పీకే విశ్వేశ్వర్ రెడ్డి. కొత్త బాలసుబ్రమణ్యం. కొత్త విజయ రాజలక్ష్మి. పిల్లి నిర్మల. సప్ప ఆదినారాయణ. తదితరులు పాల్గొన్నారు.