నటుడు కృష్ణంరాజు మృతి


 TV77తెలుగు హైదరాబాద్ :

ప్రముఖ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి లో చికిత్సపొందుతూ కృష్ణంరాజు కన్నుమూరు. 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో 'చిలకా గోరింక' చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించారు. ‘అవేకళ్లు’ చిత్రంలో రెబల్ విలన్ గానూ నిరూపించుకున్నారు. కృష్ణంరాజు 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.