TV77తెలుగు కోయంబత్తూరు:
కోయంబత్తూరులో ఓనం వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పి కారు బావిలో పడిపోయినట్టు తెలుస్తోంది.70 అడుగుల లోతున్న బావిలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కాలేజీ విద్యార్థులు చనిపోయారు. ఓనం వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. తొండాముత్తూర్‌లోని పొలాల దగ్గర రోడ్డు పక్కనే ఉన్న బావిలో కారు పడిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.