ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే ప్రతిపక్షం కావలి.మేడా శ్రీనివాస్

 


TV77తెలుగు రాజమహేంద్రవరం :

దేశ వ్యాప్తంగా ఈవీఎం లను రద్దు చేయాలి, బ్యాలెట్ ను అమలు చేయాలి. 

ఎన్నికల సంఘం మెరుగైన  సంస్కరణలు అమలుచేయకపోతే భారత్ లో అంతర్యుద్ధం తధ్యం. 

మోది (బిజెపి)రహిత పాలనే భారత్ కు శ్రీరామ రక్ష. 

ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ నియమించాలి. 

 ప్రజా తీర్పు మోది పాలనకు గుణపాఠం కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోవటం రాష్ట్ర ప్రజలు దురదృష్టంగా భావించాలని, ఆంధ్రప్రదేశ్ లో పాలకపక్షంను సిబిఐ, ఈడి లను చూపించి మోది (బిజెపి)సర్కార్ బెదిరిస్తున్నారని, పాత కేసులను,ఇతర ఆర్ధిక లెక్కలను  చూపిస్తు తెలుగుదేశం పార్టిని మోది చెప్పుచేతల్లో పెట్టు కున్నారని,టిడిపి, వైసిపి పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో శత్రువులు అయినప్పటికీ ఢిల్లీ లో మాత్రం ఈ రెండు పార్టీలు మోది బూట్లు తుడవాల్సిందే నని, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతం అవ్వటం కన్నా జగన్, చంద్రబాబు బలహీనతలే మోదికి  మెండుగా కలిసొస్తున్నాయని, అందుకే తెలంగాణా పై బిజెపి ద్రుష్టి సారిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పై ద్రుష్టి కేంద్రీకరించటం లేదని, అందుకనే ఏపిలో సమర్థులకు బిజెపి పగ్గాలు ఇవ్వటం లేదని, విలువైన రాష్ట్ర సంపదను మోది సర్కార్ తరలించుకు పోతున్నా పాలక పక్షం, ప్రతిపక్షం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తు రాష్ట్ర అభివృద్ధిని అమ్మేస్తున్నారని, ఆంధ్రాలో ప్రశ్నించే తత్వాన్ని ఉక్కు పాదం తో చిదిమేస్తున్నారని, చట్టం ముసుగులో పౌరులను వేధిస్తున్నారని, ఏపి పాలకుల అవినీతిని కేంద్రం ప్రోత్సహిస్తూనే రాష్ట్ర సంపదను దోపిడీకి మార్గం చేసుకుంటున్నారని, ప్రజల ద్రుష్టి మళ్లించటానికే ఏపిలో ప్రతిపక్షంగాను, పాలకపక్షం గాను కొనసాగుతున్నారని, కేంద్రంలో మాత్రం మోది కనుసైగలో నడవాల్సిందే నని, కేంద్రం విడుదల చేసిన నిధులు కన్నా ఏపి నుండి కేంద్రం పట్టుకుపోతున్న సంపద వెలకట్ట లేనిదని, ఆంధ్రప్రదేశ్ లోగల సహజ నిక్షేపాలను గుల్ల చేసి రాబోవు రోజుల్లో భూ కంపాలకు కేంద్ర స్థానం గా చరిత్ర పుటల్లో ఆంధ్రప్రదేశ్ ను నిలపటమే మోది సర్కార్ కక్ష పూరిత ధోరణి అని ఆయన తీవ్రంగా విమర్శించారు.భారత్ లో మోది సర్కార్ పై అత్యంత ప్రజా వ్యతిరేకత ఉన్నపటికీ బిజిపి తిరుగులేని మెజార్టీ ఓట్లను సమకూర్చుకుంటుందని, మోది అధికార దుర్వినియోగంతో ఎన్నికల సంఘంను  నోరుమెదప నీయటం లేదని,ఎన్నికల ఫలితాలు ప్రజలను విష్మయానికి గురిచేస్తున్నాయని, పాలకులు ఓటర్లను నమ్మటం లేదని కేవలం మోది ఈవీఎం లను మాత్రమే నమ్ముకుంటున్నారని, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎం లను వినియోగించకుండా బ్యాలెట్ ను ఉపయోగిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వుందని, అందుకనే చంద్రబాబు జగన్ మోదిని నమ్ముకుంటున్నారని, భారత్ లో ఎన్నికల నిర్వహణ తీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా వుందని, అప్రజాస్వామ్యమే రాజ్యమేలుతుందని, అంబేద్కర్ సాక్షిగా మన చట్టాలు దుర్వినియోగం ఆవుతున్నాయని, భారత్ లో కాలం చెల్లిన తీర్పులు  "పస్తుం" షెరియత్  శాసనాలను గుర్తుచేస్తున్నాయని,ఈవీఎం లతో ఓటుకు భద్రత లేదు అని సాంకేతిక నిపుణులు అనేక సందర్భాల్లో శాస్త్రీయ పరంగా నిరూపించినా భారత  ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా కొట్టిపడేయటం ప్రజాస్వామ్యానికి ఈ తరహా పాలన గొడ్డలిపెట్టు వంటిదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఎన్నికల నియమ నిబంధనలకు, ఎన్నికలు జరుగుతున్న తీరుకు పొంతన లేకుండా పోతుందని,నిబంధనలకు విరుద్ధంగా గెలుపొందిన అభ్యర్థి పై తుది తీర్పు అధికారం చివరి వరకు అనుభవించిన తరువాత కూడా ఎన్నికల సంఘం తీర్పులు వెలువడటం లేదని, పేరుకు మాత్రమే భారతదేశం అత్యున్నతమైన  ప్రజాస్వామ్యం అని అమలులో మాత్రం రాక్షస పాలన అని, భారత్ లో సామాన్యులకు రాజ్యాంగ బద్దమైన హక్కులు అందని ద్రాక్షగానే వుంటాయని, నిత్యం సైబర్ నేరగాళ్ల వలలో ఎంతో మంది సామాన్యులు నష్టపోతున్నారని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఒకే ఒక్క ఫోన్ కాల్ వచ్చినందుకు తక్షణమే పోలీసులు  స్పందించి  ఆ నేరగాళ్ళను అదుపులోకి తీసుకున్నారని, సామాన్యుల ఫిర్యాదులను పట్టించుకునే ప్రభుత్వం లేకపోవడం ప్రజల దురదృష్టం అని,కిరాయి దర్బార్లు చట్టవ్యతిరేకంగా కొనసాగుతుంటుంటే పాలన ముసుగులో చట్టబద్ధంగా అవినీతికి పాలనను  అమ్మేస్తున్నారని, డబ్బులిచ్చి గుద్దించుకునే సామెత వలే ఓట్లు వేసి మరి ప్రజలు తొక్కించుకుంటు తన్నించుకుంటున్నారని  అని ఆయన తీవ్ర వేదనకు గురైయ్యారు. భారత్ కు మోది రహిత పాలన భారతదేశానికి ఎంతైనా అవసరముందని, ప్రజాస్వామ్యాన్ని ఖరీదైన మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారంగా  సాగిస్తుంన్నారని, భారతదేశం లోనే అత్యంత విలువైన సహజ వనరుల నిక్షేపాల్లో ఒకటైన పెట్రోలియం కెమికల్స్ సంపద అంతా ఆంధ్రప్రదేశ్ నుండి మోది సర్కార్ దోచుకు పోతుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని ద్వేషపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని, పెట్రోలియం నిక్షేపాలను కేజీ బేసిన్ నుండి దోచేస్తు అభివృద్ధి అంత గుజరాత్ వైపు మళ్లిస్తున్నారని, దేశంలో ఏ రాష్టంలోను లేని విధంగా గుజరాత్ పిట్రోలియం కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి భారత సర్కార్ కి చెందాల్సిన ఆర్ధిక రెవిన్యూ ను ఒక్క గుజరాత్ రాష్ట్రం కె దక్కే విధంగా కుట్ర చేయటం అన్యాయమైన చర్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు.విప్లవాత్మకమైన చైతన్యం తో భారత ఎన్నికల సంఘం ఈవీఎం లను రద్దు చేసి బ్యాలెట్టు ను అమలు చేయాలని,ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణకులు కావాలని, ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి పెట్రోలియం ఉత్పత్తుల లాభాలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి కి దోహద పడాలని, భారత్ లో మెరుగైన సంస్కరణలు యుద్దప్రాతిపదికన చేపట్టక పొతే అంతర్యుద్ధం తప్పదని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు .ఈ సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,కాసా రాజు, లంక దుర్గాప్రసాద్,  దుడ్డె సురేష్,వర్ధనపు శరత్ కుమార్, మట్టపర్తి తులసి, మార్త ప్రభాకర్, నాగూర్ అన్నపూర్ణ, మాసా అప్పాయమ్మ, నాగూర్ దుర్గ ,  సుంకర వెంకట భాస్కర రంగారావు, వాడపల్లి జ్యోతిష్ మండవల్లి వెంకటేశ్వరరావు, మండవల్లి సూరిబాబు, మండవల్లి శంకర్, ద్వాదశి శ్రీనివాసరావు, కంచర్ల సత్యనారాయణ, వట్టి శ్రీనివాసరావు,  తదితరులు పాల్గొనియున్నారు.