TV77తెలుగు మండపేట :
స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 69వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి మాట్లాడుతూ జక్కంపూడి జననేత అని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు మరువలేనిమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్, కౌన్సిల్ సభ్యులు చిట్టూరి సతీష్, మొండి భవాని మురళి, మాలసాని సీతామహాలక్ష్మి, మారిశెట్టి సత్యనారాయణ, కొవ్వాడ బేబిఅప్పన్నబాబు, పట్టణ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, పి.పుల్లేశ్వరరావు, పలివెల సుధాకర్, ఉండ్రాజవరపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.