మూడేళ్లుగా ముస్లింలకు ఒరిగింది ఏమిటి ?


TV77తెలుగు రాజమహేంద్రవరం :

రాజమండ్రి ముస్లింలలో తీవ్ర అసహనం

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేయాలి

రాష్ట్రంలో గత మూడేళ్లుగా అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఈ మూడేళ్లలోను ముస్లింలకు చేసిన ఉపకారం ఏముందని ముస్లిం వర్గాల లో అసంతృప్తి నెలకొంది. రాజమండ్రి నగరంలో ముస్లిం జనాభా కీలక భూమిక వహించే స్థాయిలో ఉన్నారు. నగరంలో ముస్లిముల చారిత్రాత్మక. సంస్కృతిగా ప్రాధాన్యం కలిగి ఉన్నారు. పెద్ద మసీదు. చిన్న మసీదు.ఈద్గా మైదానం. జాంపేట లో ప్రముఖ మసీదుల తో పాటు, ఎన్నో చిన్న మసీదులు,  ఎన్నో  షాదీఖానా లు,. సున్నీ. షియా. నూరు బాషా లు వంటి వర్గాలు చెందిన వేలాది మంది ముస్లింలు నివసిస్తున్నారు. వీరిలో నూటికి 90 శాతం మంది పేదల గానే జీవిస్తున్నారు. ఎన్టీఆర్.  వైయస్ రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ల హయాం లో ముస్లిం  సంక్షేమం ,అభివృద్ధి, జరిగేది. అయితే గత ప్రభుత్వల పాలనలో కన్నా జగన్ పాలనలో ముస్లింల జీవితాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలు అయ్యాయని గత మూడేళ్లుగా వైయస్ జగన్ పరిపాలన లో ఏమీ చేయలేదని ముస్లిం వర్గాలలో అసహనం వ్యక్తమవుతుంది. రాజమండ్రి నగరంలో ముస్లింలకు చెందిన మసీదులు. సమాధుల అభివృద్ధి. పేద ప్రజల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయిందని ముస్లిం వర్గాల లో అసంతృప్తి వ్యక్తమౌతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఈ మూడేళ్లలో ను రాజమండ్రి ముస్లిముల జాతి అభివృద్ధికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదని మెజార్టీ ముస్లింలు వాపోతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజమండ్రి ముస్లింలకు , మసీదులు. సమాధులు అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ  జీవో లు జారీ చేయడం జరిగింది.  అయితే ఈ మూడేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని విమర్శలు తలెత్తుతున్నాయి. నగర ముస్లిం వైసిపి నాయకులు , ప్రజా ప్రతినిధులు సైతం ఈ మూడేళ్ల కాలంలోనూ నిధులు మంజూరు అయిన జీవోలను కార్యాచరణలోకి తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని ముస్లిం వర్గాల లో నిరాశ ,నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. జాంపేట లో గత దశాబ్ద  క్రితం నిర్మితమైన ఆజాద్ స్థూపంపై రుడా నిధులతో పునరుద్ధరించిన కొత్త గడియారం ను మంత్రి వేణు గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ,  గత ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరైన జీవోలను కార్యరూపంలోకి తెచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు. పార్టీ నాయకులు కృషిచేయాలని. నగర ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.